బుధవారం 03 జూన్ 2020
Telangana - May 08, 2020 , 19:45:06

బాండు రాసి బండి తీసుకో...

బాండు రాసి బండి తీసుకో...

కరోనా నేపధ్యంలో ప్రభుత్వం విధించిన నిభందనలు ఉల్లగించి అనేక మంది వాహన దారులు అకారణంగా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో పోలీసులు అడుగడుగునా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి లాక్‌ డౌన్‌ ఆంక్షలను ఉల్లంగాంచిన వారి వాహనాలను సీజ్‌ చేసారు. నిజంగా అవసరం ఉండి బయటకు వచ్చిన వారు తక్కువ సంఖ్యలో ఉంటే చిన్న చిన్న వంకలతో రోడ్ల మీదకు వచ్చిన వేలాది వాహనాలను పోలీసులు సీజ్‌ చేసి రోడ్ల పక్కన అనేక ప్రాంతాల్లో ఉంచారు. అయితే వీటిని రక్షించేందుకు పోలీసు శాఖకు అదనపు భారంగా ఉండడంతో నిభందనలు ఉల్లంఘించిన వారి వాహనాలను యజమానితో బాండు రాయించుకుని వారికి అప్పగించాలని డీజీపీ పోలీసులకు సూచించారు. కానీ ఉల్లంఘనలకు సంబందించిన కోర్టు కేసులు మాత్రం కొనసాగనున్నట్లు తెలిపారు.


logo