సోమవారం 01 జూన్ 2020
Telangana - May 08, 2020 , 18:45:55

కరోనా సోకిన గర్బిణికి గాంధీ దవాఖానలో కాన్పు

కరోనా సోకిన గర్బిణికి గాంధీ దవాఖానలో కాన్పు

హైదరాబాద్ : కరోనా సోకిన ఓ గర్బిణి హైదరాబాద్ గాంధీ దవాఖానలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కరోనా సోకడంతో తల్లి ఆరోగ్య, మానసిక స్థితిపై ఆందోళనగా ఉండేది. అయితే సదరు  గర్భిణికి వైద్యులు  ప్రత్యేక జాగ్రత్తలతో శస్త్ర చికిత్స చేశారు.  తల్లీ బిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా  వైద్యులు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందిస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు. ఎట్టకేలకు వైద్యుల కృషి  ఫలించడంతో ఆ తల్లి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యుల వెల్లడించారు.logo