శనివారం 06 జూన్ 2020
Telangana - May 08, 2020 , 17:45:10

జప్తు చేసిన వాహనాలు తిరిగి ఇచ్చేయండి : డీజీపీ మహేందర్ రెడ్డి

జప్తు చేసిన వాహనాలు తిరిగి ఇచ్చేయండి : డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్ : లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. వాటిని లాక్ డౌన్ ఎత్తివేశాక కోర్టులో చలానా కట్టి విడిపించుకోవాల్సి ఉంది. కాగా రోజురోజుకు జప్తు చేస్తున్న వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో డీజీపీ మహేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జప్తు చేసిన వాహనాలను జరిమానా వసూలు చేసి వాహనదారులకు అందించాలని డీజీపీ పోలీస్ అధికారులను ఆదేశించారు. వేల సంఖ్యలో జప్తు చేసిన వాహనాలు భద్రపరచడంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు.


logo