మంగళవారం 26 మే 2020
Telangana - May 08, 2020 , 17:23:47

నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం

నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం

హైదరాబాద్:  హైదరాబాద్  చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన షకీల్ పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని, రాష్ట్ర గిరిజన , స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే మహిళా, శిశు సంక్షేమ శాఖ తరపున జిల్లా సంక్షేమ అధికారి, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు బాలిక వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసే హడావిడి చర్యలు చేపట్టకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. 

తమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు బాలిక కుటుంబ సభ్యులతో టచ్ లో ఉండి, అమ్మాయి భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. దళిత బాలిక పట్ల ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడిన షకీల్ కు కఠిన శిక్ష పడుతుందని, ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి చర్యలకు తావులేన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అమ్మాయిని ఓదార్చడం కోసం రాజకీయాలు చేయొద్దని, రాజకీయ హడావిడిలో అమ్మాయి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని  కోరారు.బాధిత బాలికకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.


logo