సోమవారం 01 జూన్ 2020
Telangana - May 08, 2020 , 16:46:59

వానాకాలం సాగుకు ఎరువుల కొరత ఉండొద్దు

వానాకాలం సాగుకు ఎరువుల కొరత ఉండొద్దు

వానాకాలం పంటలకు రైతులకు కావాల్సిన ఎరువులపై హాకాభవన్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రం కోసం గతంలో కోరిన రేక్ పాయింట్లు వెంటనే మంజూరు చేయాలని రైల్వే అధికారులను కోరాలని అధికారులకు సూచించారు మంత్రి. రామగుండం ఎరువుల కార్మాగారం వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. క్షేత్రస్థాయికి ఎరువుల నిల్వలు చేరాలని మంత్రి సూచించారు. కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని దానికి తగినట్లు ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి. రేక్ పాయింట్లలో ఎరువులు 24 గంటలలో అన్ లోడ్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఏప్రిల్ వాటా 35 వేల మెట్రిక్ టన్నులు, మే వాటా 1.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వెంటనే  తీసుకురావాలని సమావేశంలో మంత్రి సూచించారు. రాష్ట్రంలో 2.68 లక్షల యూరియాతో కలిపి 6.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్దంగా ఉన్నాయని, మే వరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, లక్ష ఇతర ఎరువులు బఫర్ నిల్వల కింద అందుబాటులో ఉంచాలని అధికారులను అదేశించారు. సమీక్షలో మార్క్ ఫెడ్, అగ్రోస్ అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, హ్యాడ్లింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.


logo