శనివారం 06 జూన్ 2020
Telangana - May 08, 2020 , 14:00:09

మద్యం దుకాణానికి రూ. 5వేల జరిమానా

మద్యం దుకాణానికి రూ. 5వేల జరిమానా

హైదరాబాద్ : లాక్ డౌన్ అమలును అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడా ఝులిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాస్క్ లేని వ్యక్తికి మద్యం అమ్మినందుకు.. మల్లికార్జున వైన్స్ కు రూ. 5 వేల జరిమానా విధించారు. మాస్క్లులు ధరించిన వ్యక్తులకే మద్యం విక్రయించాలని లేకుంటే జరిమానా విధిస్తామని పురపాలక కమిషనర్ సమ్మయ్య హెచ్చరించారు. అలాగే మంచిర్యాల జిల్లాలో మాస్క్ లు లేకుండా తిరుగుతున్నవారికి శ్రీరాంపూర్ పోలీసులు రూ.1000 ఫైన్ వేశారు. చెన్నూర్ నియొజకవర్గ కేంద్రంలో ఉదయం మార్కెట్ లో మాస్క్ ధరించకుండా కూరగాయలు అమ్ముతున్నందుకు  మున్సిపల్ అధికారులు  రూ. 500 ఫైన్ వేశారు.


logo