గురువారం 04 జూన్ 2020
Telangana - May 08, 2020 , 13:10:39

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం ఒకేసారి మాఫీ చేసింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ను కొనియాడుతున్నారు. ఊరురా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్‌ మాత్రమే అని రైతులు పేర్కొంటున్నారు. రైతుల ముఖాల్లో ఆనందం నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ నినదిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే రైతు రుణమాఫీకి గురువారం రూ. 1210 కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. రైతుబంధు పథకం కోసం రూ. 7 వేల కోట్లు మంజూరు చేసింది. రైతు రుణమాఫీ వల్ల దాదాపు 5.88 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. 


logo