ఆదివారం 31 మే 2020
Telangana - May 07, 2020 , 23:28:57

భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త

భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన రామకృష్ణాపూర్‌లో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని రామకృష్ణాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్లో సురేష్ సంధ్యారాణి నివసిస్తున్నారు. కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. గురువారం రాత్రి  తొమ్మిది గంటల ప్రాంతంలో సురేష్ భార్య సంధ్యను(25) కత్తితోపొడిచి హత్య చేశాడు.  పోలీసులకు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వచ్చి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతిరాలికి  8 నెలల అబ్బాయి ఉన్నాడు. 


logo