మంగళవారం 26 మే 2020
Telangana - May 07, 2020 , 23:14:39

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఓ వరం

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఓ వరం

భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపహాడ్ మండల కేంద్రమైన బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్ ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టారని అన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులకు ఈ పథకం వరంగా మారిందని ఆయన పేర్కొన్నారు, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా ఉంటానని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు ఎమ్మెల్యే. లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బూర్గంపాడులో ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు గోనెల నాని సహకారంతో 1500 మంది పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. నాగినేని ప్రోలు రెడ్డి పాలెం గ్రామంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలతకొండారెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మందికి కూరగాయలు పంపిణీ చేశారు.


logo