శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 07, 2020 , 22:47:37

సరూర్‌నగర్‌ స్టేడియంలో మార్కెట్‌ పరిశీలన

సరూర్‌నగర్‌ స్టేడియంలో మార్కెట్‌ పరిశీలన

కొహెడలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని సరూర్‌నగర్‌ స్టేడియంలో రేకులతో ఏర్పాటు చేసిన షెడ్డును పరిశీలించారు అధికారులు. ప్రస్తుతం సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన రైతుబజార్‌లో క్రయ విక్రయాలు జరగనప్పటికీ త్వరలో ఎప్పటిలా కూరగాయల అమ్మకాలు కొనసాగనున్నాయి. ఈ నేపద్యంలో అక్కడ ప్రమాదం జరిగే ఆస్కారాలు ఏమైనా ఉన్నాయా అనే ఉద్దేశంతో జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌ రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ అధికారులు నర్సింహా రెడ్డి, సంతోష్‌, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ క్రమంలోనే పలు షెడ్లు ప్రమాదకరంగా ఉండడాన్ని గమనించి ప్రమాద రహితంగా పలు మార్పులు చేయాలని అధికారులకు తెలిపారు. రానున్న రోజుల్లో వానతో పాటు ప్రమాదకర స్థాయిలో గాలులు వచ్చే అవకాశం ఉండవచ్చన్న అంచనాలతో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు మార్కెటింగ్‌ శాఖ అధికారులు. logo