శనివారం 30 మే 2020
Telangana - May 07, 2020 , 20:36:52

తెలంగాణ అన్నపూర్ణ 'కాళేశ్వరం' : ఈటల

తెలంగాణ అన్నపూర్ణ 'కాళేశ్వరం' : ఈటల

కాళేశ్వరం: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో  చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే అన్నపూర్ణగా మారనున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలన్న ఆలోచన రావడం, అనుకొన్న గడువులోగా  పనులు పూర్తిచేయడం  తెలంగాణప్రజల అదృష్టమన్నారు. గురువారం నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌హైజ్‌ను మంత్రి సందర్శించారు. హైదరాబాద్‌ నుంచి కన్నెపల్లికి ప్రత్యేక హెలీకాప్టర్‌లో మంత్రి వచ్చారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో అనుకొన్న గడువులోగా  మహాద్భుతాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారని కొనియాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన  పనులను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, ఆగస్టు నాటికి మూడో టీఎంసీ నీరు ఎత్తిపోసేలా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


logo