గురువారం 28 మే 2020
Telangana - May 07, 2020 , 19:50:45

మామిడి విక్రయాల్లో సెర్ప్‌ సక్సెస్‌

మామిడి విక్రయాల్లో సెర్ప్‌ సక్సెస్‌


హైదరాబాద్‌: మామిడిపండ్ల క్రయవిక్రయాల్లోకి ప్రవేశించిన సెర్ప్‌.. అక్కడ కూడా విజయవంతం అవుతున్నది. ధాన్యం కొనుగోలు తరహాలో మామిడిని కూడా నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తున్నది. శాస్త్రీయ పద్ధతిలో కాయలను మగ్గబెట్టి అమ్మకాలు సాగిస్తున్నది. ఈ ఏడాది  మూడు వేల  మెట్రిక్‌ టన్నుల క్రయవిక్రయాలు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 2,500 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసింది. మామిడి  పండ్లను అమ్ముతున్న రైతులకు 48 గంటల్లో డబ్బు చెల్లిస్తున్నారు. 

గురువారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసిన సెర్ప్‌ డైరెక్టర్‌ ఎన్‌ రజిత.. మామిడి కొనుగోళ్లు, మగ్గబెట్టడం, అమ్మకాలకు అనుసరిస్తున్న పద్దతులను వివరించారు. మాఖిక ప్రచారంతోనే గేటెడ్‌ కమ్యూనిటీల వరకు రిటైల్‌గా విక్రయాలు జరపుతున్నామని తెలిపారు. మామిడిపండ్లను అమ్మగా వచ్చిన లాభాల్లో 25 శాతం రైతుకు ఇస్తున్నట్టు రజితి వెల్లడించారు.logo