శనివారం 06 జూన్ 2020
Telangana - May 07, 2020 , 18:15:46

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి రూ.1.16 కోట్ల చెక్కులు అందజేశారు రాష్ట్ర సీడ్స్ మెన్ అసోసియేషన్ సభ్యులు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు ఎఎస్ఎన్ రెడ్డి, సభ్యుడు ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే రూ.1.70 కోట్ల చెక్కులు మంత్రి కేటీఆర్‌కు అందజేసినట్లు, మరో రూ.14 లక్షలు వివిధ జిల్లాల నుండి రాగానే అందజేయనున్నట్లు వారు మంత్రితో తెలిపారు. కరోనాపై పోరాడుతున్న సర్కారుకు తమ వంతు చేయూత ఇవ్వాలనే ఈ ప్రయత్నం చేసిన సీడ్స్ మెన్ అసోసియేషన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు.


logo