ఆదివారం 31 మే 2020
Telangana - May 07, 2020 , 12:09:39

అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం.. 13 నెలల బాబు మృతి

అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం.. 13 నెలల బాబు మృతి

సూర్యాపేట : అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర రోడ్డుప్రమాదం జరగడంతో.. 13 నెలల బాబు మృతి చెందాడు. ఈ ఘటన చివ్వెంల మండలం బండమీది చందుపట్ల వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యపేట జిల్లా మోతె మండలం రాంపురంతండాకు చెందిన భూక్య భిక్షం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నాడు. తండాలో ఉండే బిక్షం తండ్రి భూక్య బింగ్య (80) అనారోగ్యంతో నిన్న మృతి చెందాడు. 

తండ్రి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులతో నిన్న రాత్రి స్వగ్రామం బయలుదేరాడు భిక్షం. కరోనా లాక్‌డౌన్‌ వల్ల వాహనాలు అందుబాటులో లేకపోవడంతో నలుగురు పట్టే కారులో.. భిక్షం, ఆయన ఇద్దరు భార్యలు, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, వారి పిల్లలతో కలిసి బయల్దేరారు. అర్ధరాత్రి సమయంలో చివ్వేంల మండలం బండమీది చందుపట్ల వద్ద డీసీఎం వ్యాను - కారును ఢీకొట్టడంతో భిక్షం మనవడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ వారిని సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి, హైదరాబాద్ కు తరలించారు.


logo