ఆదివారం 31 మే 2020
Telangana - May 07, 2020 , 06:51:32

‘జోగుళాంబ’లో ఆన్‌లైన్‌ ఆర్జిత సేవలు

‘జోగుళాంబ’లో ఆన్‌లైన్‌ ఆర్జిత సేవలు

అలంపూర్ : జోగుళాంబ ఆలయాల్లో ఆర్జిత సేవల ను ఆన్‌లైన్‌లో ప్రవేశ పెట్టినట్లు ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో పూజలు చేయించుకోదలచిన భక్తులు http: //ts.meeseva.telangana.gov.in వెబ్‌ సైట్‌ లో పేర్లు రిజిస్టర్‌ చేసుకుని అనంతరం యూజర్‌ ఐడీ పాస్‌వర్డ్‌ సహాయంతో లాగిన్‌ కావాలి. తర్వాత జోగుళాంబ ఆలయం పేరు సెలెక్టు చేసుకొని, సేవలు కాలంలోకి వెళ్లి మీరు చేయించదలచిన పూజా కార్యక్రమాల వివరాలు రుద్రాభిషేకం, త్రిశతి, అర్చన, రుద్రహోమం, చండీహోమం తదితర వాటిని ఎంచుకోవాలి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు మేసేజ్‌ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. 


logo