ఆదివారం 31 మే 2020
Telangana - May 07, 2020 , 01:13:13

రూ. 1500 ఆర్థికసాయం అందలేదా ..?

 రూ. 1500 ఆర్థికసాయం అందలేదా ..?


హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడానికి  తెలంగాణ సర్కారు రూ.1500 నగదుతో పాటు ఉచిత బియ్యం అందిస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఆ నగదు తమకు బ్యాంకుల్లో పడటం లేదంటూ.. పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం వివరాలు, సమస్యల పరిష్కారం కోసం ఓ టోల్‌ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. తెల్ల రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 ఆర్థికసాయం వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. అలాగే ఉచిత రేషన్ బియ్యం సరఫరాలో డీలర్లు ఇబ్బందులు పెట్టినా ఈ నెంబర్‌కి సంప్రదించవచ్చని సూచించింది. ఫిర్యాదుల కోసం 1800 425 00333, 1907 నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది. ఆర్థిక సాయం కోసం 040 23314614 నెంబర్‌కి చేయాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం. కాగా ఈ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే.. ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్‌ను కూడా అందుబాటులో ఉంచింది ప్రభుత్వం.


logo