గురువారం 28 మే 2020
Telangana - May 06, 2020 , 17:24:02

కరీంనగర్‌లో దుకాణాలకు సరి బేసి విధానం

కరీంనగర్‌లో దుకాణాలకు సరి బేసి విధానం

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాల్లో సరి బేసి విధానాన్ని అమలు చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమీషనర్‌ వల్లూరి క్రాంతి తెలిపారు. ఆదేశాలు అందుకున్న మున్సిపల్‌ సిబ్బంది ఇప్పటికే నగరంలోని దుకాణాలకు నంబర్లు వేస్తున్నారు. ఆదేశాల ప్రకారం కేటాయించిన నంబర్లలో సరి సంఖ్య వారికి కేటాయించి ఉన్న తేదీల్లో సరి సంఖ్య  వారు, బేసీ సంఖ్య వారికి కేటాయించిన తేదీల్లో బేసీ సంఖ్య వారు మాత్రమే దుకాణాలను తెరుచుకోవచ్చు. అలాగే మొత్తం దుకాణాలను మూడు క్యాటగిరీలుగా విభజించారు. 

క్యాటగిరీ ఏ 

నిత్యావసర దుకాణాలు, మద్యం దుకాణాలు, నిర్మాణ రంగానికి సంబందించిన దుకాణాలు

క్యాటగిరీ బీ

బట్టల దుకాణాలు, పాదరక్షల దుకాణాలు వంటివి

క్యాటగిరీ సీ

హోటల్స్‌, స్కూల్స్‌, సినిమా హాల్స్‌, జిమ్స్‌

ఇందులో క్యాటగిరీ ఏ లో ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు, క్యాటగిరీ బీ లో సరి బేసి విధానాలు అమలు, క్యాటగిరీ సీ లో దుకాణాలు తెరవకుండా చర్యలు తీసుకోనున్నారు. 

క్యాటగిరీ వారిగా దుకాణాలు తెరచి సామాజిక దూరం పాటిస్తూ విక్రయాలు జరుపుకోవాలని కమీషనర్‌ వ్యాపారులకు సూచించారు. అలాగే మాస్కులు, సానిటైజర్లు తప్పక వాడాలి. మాస్కు లేకుండా ఏ వ్యాపారి అమ్మకాలు జరుపకూడదు. షాపులో తప్పనిసరిగా సానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ప్రజలు పట్టుకునే చోట్ల రెడ్‌ మార్కింగ్‌ చేయాలి. లేదా అలాంటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు సానిటైజేషన్‌ చేయాలి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగిస్తే సంబందిత వ్యక్తలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు తనిఖీలు జరుపనున్నట్లు తెలిపారు కమీషనర్‌.


logo