ఆదివారం 31 మే 2020
Telangana - May 06, 2020 , 16:53:58

దుబాయి వలస కార్మికుడు మృతి

దుబాయి వలస కార్మికుడు మృతి

కరోనా కారణంగా స్వగ్రామానికి తీసుకురాలేని పరిస్థితిలో మృతదేహం

మృతుడి మృతదేహాన్ని కడసారి చూడలేక కుటుంబ సభ్యుల ఆవేదన

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లికి చెందిన మారం గంగయ్య(40) బతుకుదెరువుకు 17 ఏండ్ల కింద నుంచి దుబాయికి వచ్చి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దుబాయి నుండి చివరగా వచ్చినా గంగయ్య 6 నెలల క్రితమే తిరిగి దుబాయ్‌ వెళ్ళాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం కూడా కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలిసింది. కరోనా నేపద్యంలో శవాన్ని స్వస్థలానికి పరిస్థితి ఉండడంతో కుటుంబ సభ్యులు కడచూపుకు నోచుకోలేని స్థితి. దీంతో కటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. 

చివరగా గత నెల 29న కుటుంబ సభ్యులకు ఫోన్‌లో మాట్లాడిన గంగయ్య జ్వరం ఉన్నట్లు అసుపత్రికి వెళ్ళి చూపించుకుంటానని చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గంగయ్య మరణించిన తరువాత ఆలస్యంగా అతనితో కలిసి పని చేసే కార్మికుల ద్వారా గంగయ్య కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో కుటుంబికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడు గంగయ్యకు భార్య లక్ష్మి, కుమార్తె శిరీష, కుమారుడు ఈశ్వర్‌ ఉన్నారు. 


logo