శనివారం 30 మే 2020
Telangana - May 06, 2020 , 16:19:01

40 డిగ్రీల ఎండలో మీ పోలీసులు

40 డిగ్రీల ఎండలో మీ పోలీసులు

40 డిగ్రీల మండుటెండలో కూడా మీ కోసం మీ పోలీసులు విధులను నిర్వర్తిస్తున్నారని ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర డీజీపీ మహెందర్‌ రెడ్డి ట్వీట్‌ చేసారు. రాష్ట్ర డీజీపీ అధికారిక ఖాతా ద్వారా ఈ రోజు ప్రజలకు, పోలీసులకు ఆలోచింపజేసే ట్వీట్‌ చేసారు. అందులో మీ పోలీసులు 40 డిగ్రీల ఎండలోనూ మీ కోసం ఎండలో విధులు నిర్వర్తిస్తున్నారని. వారి కష్టాన్ని గమనించి వారి కోసం మీరు ఇంట్లోనే ఉండాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు డీజీపీ. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ చేసిన ఒక ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ డీజీపీ ఈ ట్వీట్‌ను చేసారు. 

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ట్విట్టర్‌ ఖాతాలో ట్రాఫిక్‌ ఏసీపీ రాములు నాయక్‌ ఎండలో నిలపడి విధులు నిర్వహిస్తున్న చిత్రాన్ని పెట్టి పాతబస్తీలో మేము విధులు నిర్వర్తిస్తాం మీరు ఇంట్లోనే ఉంటూ బయటకు రాకుండా సహకరించండి అని సందేశం ఇస్తూ ట్వీట్‌ చేసారు.


logo