ఆదివారం 31 మే 2020
Telangana - May 06, 2020 , 13:00:24

'వాళ్లు కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం'

'వాళ్లు కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం'

కొండపోచమ్మ సాగర్‌ కాలువ నిర్మాణ పనులు ప్రారంబించిన మంత్రి హరీష్‌ రావుమెదక్‌: నిజాంపేట మండలం నార్లాపూర్‌లో కొండపోచమ్మ సాగర్‌ కాలువ నిర్మాణ పనులను ప్రారంబించారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా మెదక్‌ జిల్లాను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో కొత్త కరోనా కేసులు లేవని త్వరలోనే జిల్లా గ్రీన్‌ జోన్‌లోకి మారుతుందన్నారు. కరోనా తగ్గినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు మంత్రి హరీష్‌ రావు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ఉపయోగిస్తూ సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. 

కరోనా ఉధృతిలోనూ రైతులకు నష్టం కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని అన్నారు. రైతులకు వానాకాలం పంటకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలను ఇప్పటికే ప్రభుత్వం సేకరించి పెట్టిందన్నారు. భూసారం పెంచే జిలుగు, జనుము విత్తనాలు ఎంత కావాలన్నా రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. రైతు రుణాలను మాఫీ చేయడానికి సన్నద్దమవుతున్నట్లు, రెండు రోజుల్లో ఆ డబ్బును విడుదల చేయనున్నట్లు తెలిపారు. రూ.25 వేల రూపాయల లోపు రుణాలను ప్రభుత్వం ఒకే దఫాలో మాఫీ చేయనున్నట్లు తెలిపారు మంత్రి. 5.8 లక్షల మంది రైతులకు రూ.1198 కోట్లు బ్యాంకులో జమచేయనున్నట్లు తెలిపారు. లక్ష రూపాయల రుణం ఉన్న వారికి నాలుగు దఫాలుగా మాఫీ చేయనున్నామన్నారు. వానాకాలం పంటకు రైతు బందు సాయం బ్యాంకులో జమ చేయనున్నట్లు తెలిపారు మంత్రి హరీష్‌ రావు. 

రైతుల కోసం ప్రభుత్వం ఇంత చేస్తున్నా కాంగ్రేస్‌, బీజేపీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వడ్లకు క్వింటాలుకు రూ.1835 లకు కొనుగోలు చేస్తోందని, అదే కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.1300 లకు, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రూ.1200 లకు మాత్రమే కొనుగోలు చేస్తుందన్నారు. బీహార్‌ నుండి మక్కలను తెచ్చి ఫౌల్ట్రీ రైతులకు రూ.1500 లకు ఇస్తున్నట్లు తెలిపారు మంత్రి. తెలంగాణ ప్రభుత్వం మక్కలను రైతుల నుంచి రూ.1760 లకు కొంటుందన్నారు. ఇంత చేసినా కాంగ్రెస్‌, బీజేపీలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. 


logo