గురువారం 28 మే 2020
Telangana - May 06, 2020 , 10:59:59

బారులు తీరిన మందుబాబులు

బారులు తీరిన మందుబాబులు

కరీంనగర్‌: జిల్లాలో ఉన్న అన్ని మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు. దీంతో పోలీసులు, మద్యం దుకాణాల నిర్వాహకులు వైన్స్‌ల ముందు జనాలు సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసారు. ముఖ్యంగా నగరంలోని పలు వైన్స్‌ల ముందు తెల్లవారుజామునే మద్యం ప్రియులు వచ్చి లైన్లు కట్టేసారు. హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 45 రోజుల లాక్‌డౌన్‌ తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో ఒక్కసారిగా మందుబాబులు వైన్స్‌లకు క్యూ కట్టారు. 


logo