గురువారం 28 మే 2020
Telangana - May 05, 2020 , 15:22:16

సుప్రీం కోర్టుకు ఇచ్చే ఆధారాల పరిశీలన

సుప్రీం కోర్టుకు ఇచ్చే ఆధారాల పరిశీలన

పిటిషన్‌ వేయడానికి నివేదికపై మంత్రి కసరత్తు

న్యాయ సలహాలపై మంత్రి సత్యవతీ రాథోడ్‌ సమీక్ష

హైదరాబాద్‌: గిరిజన హక్కులను కాపాడే జీవో ఎంఎస్‌ 3 పై సుప్రీం కోర్టులో రాష్ట్రం తరపున అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ సమర్పించిన ఆధారాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతీ రాథోడ్‌ పరిశీలించారు. షెడ్యూల్‌ ఏరియాల్లోని టీచర్‌ పోస్టులను పూర్తిగా గిరిజనులతోనే భర్తీ చేయాలని జారీ చేసిన ఈ జీవోను సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. దీనిపై రివ్యూ పిటీషన్‌ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించడంతో మంత్రి సత్యవతీ రాథోడ్‌ నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గిరిజిన సంక్షేమ శాఖ కమీషనర్‌, ప్రత్యేక కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌ రెడ్డి, సంయుక్త సంచాలకులు కళ్యాణ్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని గిరిజనుల హక్కులను కాపాడేందుకు సమగ్రమైన పిటీషన్‌ దాఖలు చేయాలని, దీనికి న్యాయ నిపుణులు, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదుల సలహాలు తీసుకోవాలని ఇందుకు కావాల్సిన సమగ్ర సమాచారం సిద్దం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

త్వరలోనే గిరిజన ప్రజా ప్రతినిధుల, నిపుణుల సలహాలు తీసుకునేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు, ఇందులో సుప్రీం కోర్టు తీర్పులోని అంశాలను, పిటీషన్‌ వేయడానికి గల బలమైన కారణాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని తెలిపారు. 


logo