శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 05, 2020 , 12:06:45

ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీష్‌ రెడ్డి

ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీష్‌ రెడ్డి

  • సరిహద్దు సిబ్బందికి బత్తాయిలు, జ్యూస్‌ మిషన్లు పంపిన మంత్రి
  • సంతోషం వ్యక్తం చేస్తున్న సిబ్బంది
  • సూర్యాపేట: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మండుటెండల్లో దామరచర్ల వద్ద సరిహద్దు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రెండు టన్నుల బత్తాయితో పాటు రెండు జ్యూస్‌ మిషన్లు పంపించి మంత్రి జగదీష్‌ రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవల కోదాడ పర్యటనలో భాగంగా ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలకు వెళ్ళిన మంత్రి జగదీష్‌ రెడ్డి దృష్టికి అక్కడి సిబ్బంది బత్తాయిల అంశాన్ని తీసుకురాగా సానుకూలంగా స్పందించిన మంత్రి కేవలం 24 గంటల్లోనే అక్కడకు బత్తాయిలు, జ్యూస్‌ మిషన్లు పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రాష్ర్టాల సరిహద్దుల్లో ఉన్న దామరచర్ల చెక్‌పోస్ట్‌ విషయం కూడా మంత్రి జగదీష్‌ రెడ్డికి పలువురి ద్వారా చేరగా వెంటనే స్పందించిన మంత్రి ఈ రోజు ఉదయం అక్కడకు కూడా రెండు టన్నుల బత్తాయిలు, రెండు జ్యూస్‌ మిషన్లు పంపించారు. 

    వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడంతో పాటు రోగనిరోధక శక్తికి దోహదపడే బత్తాయిలు, జ్యూస్‌ మిషన్లను మంత్రి జగదీష్‌ రెడ్డి పంపించారని తెలుసుకున్న సిబ్బంది ఆనందంతో పరవశించిపోయారు. విపత్తు సమయంలో కేవలం విధులు గుర్తుచేయడమే కాకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడేందుకు బత్తాయిలు, జ్యూస్‌ మిషన్లు పంపినందుకు మంత్రికి అక్కడి సిబ్బంది ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. 


    logo