శనివారం 06 జూన్ 2020
Telangana - May 04, 2020 , 22:58:33

వలస కార్మికుల తరలింపునకు 40 ప్రత్యేక రైళ్లు.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం

వలస కార్మికుల తరలింపునకు 40 ప్రత్యేక రైళ్లు.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండటంపై సమావేశంలో అధికారులతో సీఎం చర్చించారు. రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ర్టాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్‌, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడపనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు నడిపి కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యాతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. వలస కార్మికుల తరలింపుకు ప్రత్యేక రైళ్లను నడపాలని సీఎం కేసీఆర్‌ గజానన్‌ మాల్యాను కోరారు.


logo