గురువారం 04 జూన్ 2020
Telangana - May 04, 2020 , 22:35:52

మానవత్వం చాటిన ఎమ్మెల్సీ కడియం

మానవత్వం చాటిన ఎమ్మెల్సీ కడియం

  • వలస కూలీలకు తక్షణ సాయంగా రూ. 15 వేలు అందజేత

వరంగల్ : కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయి పొట్ట చేత పట్టుకుని కాలినడకన సొంత రాష్ర్టాలకు వెళ్తున్న వలస కూలీలకు మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆర్థికసాయం చేసి మానవత్వం చాటుకున్నారు. సోమవారం కడియం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని తన స్వగృహం నుంచి జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలంలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కాజీపేట ప్రధాన రహదారిపై మూట ముల్లె, చిన్న పిల్లలను ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్తున్న వలసకూలీలు కన్పించారు. దీంతో ఆయన తన వాహనాన్ని ఆపి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. దారి ఖర్చులు, తక్షణ అవసరాల కోసం వెంటనే రూ. 15 వేల ఆర్థికసాయం అందజేశారు. అనంతరం అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతుతో మాట్లాడి వారికి భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు. 


logo