సోమవారం 01 జూన్ 2020
Telangana - May 04, 2020 , 14:46:04

ఉత్తమ్‌కుమార్‌రెడ్డివి మతిలేని మాటలు

ఉత్తమ్‌కుమార్‌రెడ్డివి మతిలేని మాటలు

ఉత్తమ్‌కుమార్‌రెడ్డివి మతిలేని మాటలు

సూర్యాపేట జిల్లాకు భారీగా శానిటైజర్స్, మాస్క్‌లను  ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో  కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కి మూడు వేల లీటర్ల   శానిటైజర్స్, మూడు వేల మస్క్ లను అందజేశారు.  తన తండ్రి నామా ముత్తయ్య ట్రస్ట్-మధుకాన్ షుగర్స్ ద్వారా  అందజేసినట్లు  ఎంపీ తెలిపారు.  కరోనా నియంత్రణ కు రాష్ట్ర  ప్రభుత్వం  చేస్తున్న కృషి కి తోడుగా స్వచ్ఛంద సంస్థలు, దాతలు  ముందుకు రావడం గొప్ప విషయమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.  సీఎం కేసీఆర్ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాలతో పాటు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల వల్లే తెలంగాణలో కరోనా అదుపులో ఉందని  మంత్రి  అన్నారు. ఎంపీ నామా కరోనా కట్టడికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. అందరం కలిసి కట్టుగా పని చేస్తే కరోనా మహమ్మారిని పారద్రోలవచ్చన్నారు.కాంగ్రెస్ హయాం లో విత్తనాల కొనుగోలు  దగ్గరి నుంచి  పంటను అమ్ముకునే వరకు రైతులు పడిన  ఇబ్బందులు వర్ణనాతీతం. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను  కొనుగోలు చేసి వారం తిరుగక ముందే మద్దతు ధర చెల్లించిన చరిత్ర ప్రపంచం లో తెలంగాణ లో తప్పా మరెక్కడా లేదని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా టెస్టుల విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ మతిలేని మాటలు మాట్లాడుతున్నాడన్నారు.రాష్ట్రంలోనే అత్యధిక పరీక్షలు చేసిన జిల్లాగా సూర్యాపేట నిలిచిందన్న విషయం మర్చిపోవద్దన్నారు. ఉత్తమ్ అండ్ కో ఉనికి కోసమే ఆరాటపడుతున్నారని తీవ్ర స్థాయి లో దుయ్యబట్టారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తుల సమాచారమిస్తే కచ్చితంగా పరీక్షలు జరుపుతామన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావాలన్నారు. 


logo