గురువారం 28 మే 2020
Telangana - May 02, 2020 , 21:35:09

చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ కు తప్పిపోయిన బాలుడి తరలింపు

 చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ కు తప్పిపోయిన బాలుడి తరలింపు ఖమ్మం జిల్లా పరిధిలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తప్పిపోయిన బాలుడిని స్థానిక ఎస్ఐ చొరవతో శనివారం చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ కి తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని కొల్లంపల్లి గ్రామాని కి చెందిన అనాధ బాలుడైన ముక్కిడి రోహిత్(12) పోలీసులకు చెక్ పోస్ట్ వద్ద తారసపడగా వివరాలు తెలుసుకున్నఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు , ఎస్ఐ ఉదయ్ కిరణ్ లు కలిసి నూతన దుస్తులు , కొంత నగదును సదరు బాలుడికి అందించి ఖమ్మంలోని చైల్డ్  వెల్ఫేర్ సెంటర్ కు తరలించారు.


logo