బుధవారం 27 మే 2020
Telangana - May 02, 2020 , 12:47:47

దేశానికే అక్షయపాత్రగా తెలంగాణ

దేశానికే అక్షయపాత్రగా తెలంగాణ

గాదెల్లేకపోవచ్చు. గరిశలు కనుమరుగై ఉండవచ్చు. అయితేనేం. తెలంగాణ మొత్తమే పేద్ద గరిశగా మారుతున్నప్పుడు ఇండ్లలో బస్తాలు, బండ్లలో బోరాలు ఏం చాలుతాయి? తెలంగాణ ఈసారి అన్నపూర్ణగా మారింది. దేశానికే అక్షయపాత్రగా మారింది తెలంగాణ. కాళేశ్వరుడి దయతో లక్ష్మీ బరాజ్‌ నుంచి ఎగిసిన గోదావరి జీవధార మన పంటపొలాల్లో సిరులు పండించింది. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల్లో ఆవిష్కృతమైన నీలి నీటి దృశ్యం.. పంటచేలకు ఇప్పటికే పచ్చటి చీర కట్టి  మురిపించగా.. కోతకొచ్చిన వరిపొలాలు కొత్త బంగారు కాంతులు విరజిమ్ముతున్నాయి. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 39 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైంది. గతంలో ఇది ఎన్నడూ 17 లక్షల ఎకరాలు దాటలేదు. ఎకరానికి 40 బస్తాల చొప్పున లెక్కేసుకున్నా ఈసారి కోటీ 5 లక్షల టన్నుల వడ్లు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యాయి. తెలంగాణ ధాన్యాగారంగా, అన్నపూర్ణగా అవతరించింది. 

అడిగేటోడుంటే.. శంకుస్థాపన రాయి పడ్తది.. మా వాటా సంగతేందని నిలదీస్తే.. అదిగో ప్రాజెక్టు అన్న మాట వినిపిస్తది.. ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ ఉత్తుత్తి ముచ్చట్లే.. పోతే బొంబాయి.. దిగితే బొగ్గుబాయి.. తవ్వితే బోరుబాయి అరిగోస మిగిలిందే తప్ప వరిసాగు జరుగనే లేదు.

మన అధికారం మన చేతికొస్తే.. మన ప్రాంతం మన పాలనలో ఉంటే.. తెలంగాణ ఏం చేయగలదో చేసి చూపించింది. చీకట్లను చిదిమేసి.. గంగమ్మకు ఎదురేగి.. చెరువులను నింపేసి.. చేనులను ఊగించింది. ఎవుసమంటేనే ఉసూరుమన్న బతుకులు..  మట్టితల్లిని వదిలిరానంటున్నాయి. ఒడ్ల రాసులతో గాబులు పొంగెత్తుతున్నాయి. ఇది కదా తెలంగాణ..!  ఇదే కదా..logo