ఆదివారం 31 మే 2020
Telangana - May 02, 2020 , 09:41:19

గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి

గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి

మంచిర్యాల : జిల్లాలోని కోటపల్లి మండలం జనగామ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులంతా ఇవాళ ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఉపాధి హామీ పనులు చేస్తుండగా.. ఎర్రోళ్ల వెంకయ్య అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వెంకయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


logo