శనివారం 06 జూన్ 2020
Telangana - May 02, 2020 , 06:56:53

అక్షయపాత్రకు లక్ష డాలర్ల విరాళం

అక్షయపాత్రకు లక్ష డాలర్ల విరాళం

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోజూ 2 లక్షల మందికిపైగా ఉచిత భోజనం అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అమెరికన్‌ టెక్నాలజీ సంస్థ జీ లిన్క్స్‌ లక్ష డాలర్ల (సుమారు రూ.75.28 లక్షలు) విరాళం అందజేసింది. ఈ విరాళం ద్వారా 5.72 లక్షల మందికి భోజనాలను అందించొచ్చని అక్షయపాత్ర తెలంగాణ, ఏపీ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస శుక్రవారం తెలిపారు. జీ లిన్క్స్‌ సంస్థకు హైదరాబాద్‌లోనూ కేంద్రం ఉన్నది.logo