శనివారం 06 జూన్ 2020
Telangana - May 02, 2020 , 06:44:03

డిజిటల్‌ మాధ్యమంలో మరిన్ని పాఠాలు

డిజిటల్‌ మాధ్యమంలో మరిన్ని పాఠాలు

  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోజువారీ పాఠాలతో పాటు కర్ణాటక సంగీతం, పద్యాలు, జానపద కళలు, కంప్యూటర్‌ విద్య, ఆరోగ్యం సంబంధిత అంశాలను కూడా ప్రసారం చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. దూరదర్శన్‌ యాదగిరి, టీసాట్‌ విద్య, నిపుణ చానళ్లలో ఈ నెల 4 నుంచి వారంపాటు ప్రసారమయ్యే షెడ్యూల్‌ను శుక్రవారం మంత్రి కార్యాలయంలో విడుదల చేశారు. విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు బోధించే నైపుణ్యాన్ని ఉపాధ్యాయులకు అందించే వెబ్‌నార్‌ను కూడా ప్రారంభించారు.  logo