బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 22:04:00

ఐదు టన్నుల క్యాట్‌ఫిష్‌ పట్టివేత

ఐదు టన్నుల క్యాట్‌ఫిష్‌ పట్టివేత

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌లో పోలీసులు 5 టన్నుల నిషేధిత క్యాట్‌ఫిష్‌ను శుక్రవారం పట్టుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దు జైనథ్‌ మండలం డొల్లార వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కర్ణాటక నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న లారీ (కేఏ 67/0471) అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు లారీ డ్రైవర్‌ను విచారించగా.. క్యాట్‌ఫిష్‌ను తీసుకుపోతున్నట్లు తెలిపారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 5 లక్షల విలువ గల 5 టన్నుల క్యాట్‌ఫిష్‌ను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.


logo