ఆదివారం 31 మే 2020
Telangana - May 01, 2020 , 21:42:02

చెట్టును ఢీకొట్టిన బైక్‌ : తండ్రీకొడుకులు మృతి

చెట్టును ఢీకొట్టిన బైక్‌ : తండ్రీకొడుకులు మృతి

నాగర్ కర్నూల్ : చెట్టును బైక్ ఢీకొని తండ్రీ, కొడుకులు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై నాగన్న తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్‌దిన్నె గ్రామానికి చెందిన రాత్లావత్‌ భాషానాయక్‌(46), కుమారుడు రమేశ్‌నాయక్‌(16)లు ద్విచక్ర వాహనంపై సొంత పని నిమిత్తం యాపట్ల గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డు మలుపువద్ద బైకు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిందని తెలిపారు. దీంతో ఇద్దరి తలలకు బలంగా గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతుడి భార్య జములమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


logo