గురువారం 04 జూన్ 2020
Telangana - May 01, 2020 , 21:37:57

నీటి కుంటలో మునిగి ఇద్దరు యువకులు మృతి

నీటి కుంటలో మునిగి ఇద్దరు యువకులు మృతి

సూర్యాపేట : లాక్ డౌన్ కారణంగా సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు యువకులు సందీప్(22), అఖిల్(22)లు ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పుచ్చకాయల కోసం బయటకు వెళ్లారు. సాయంత్రం ఆలస్యమైనా రాకపోవడంతో అక్కడక్కడ తిరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా  గ్రామంలోని ఓ రైతు చెక్ డ్యామ్ వద్ద ఉన్నట్లు గుర్తించి వెళ్లగా ఇద్దరూ శవాలై నీటిలో తేలియాడుతున్నారు. ఈత నేర్చుకునేందుకు పోయి నీట మునిగి మృతి చెందారా? లేక చేతులు కడుక్కునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగారా? అనేది తెలియాల్సి ఉంది.

ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మోతేలో కొద్ది సేపటి క్రితం జరిగింది. మోతె గ్రామానికి చెందిన లచుమాళ్ళ పాపయ్య, నాగమ్మల ఇద్దరు కూతుళ్లు ఉండగా వారు నెరేడుచెర్ల మండలం చల్లపల్లిలో ఒకరు నెరేడుగొమ్ము మండలం తిమ్మాపురంలో మరొకరు ఉంటున్నారు. వారి కుమారులైన సందీప్, అఖిల్ లు కరోనా సెలవులకు అమ్మమ్మ ఊరికి వచ్చారని బంధువులు చెప్పారు. ఇద్దరు యువకులు బీటెక్ చదువుతున్నారు. యువకుల మృతి తెలిసిన వెంటనే ఆయా కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. 


logo