బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 17:03:56

పారిశుద్ధ్య కార్మికులతో మల్లారెడ్డి సహపంక్తి భోజనం

పారిశుద్ధ్య కార్మికులతో మల్లారెడ్డి సహపంక్తి భోజనం

మేడ్చల్‌ : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడే సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ద్య కార్మికులతో కలిసి మంత్రి మల్లారెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, మేయర్‌ వెంకట్‌రెడ్డితో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

మేడ్చల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌కేవీ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గం ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ దీపిక నర్సింహారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌కేవీ నాయకులు రూప్‌సింగ్‌, రాంబాబు, నారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.logo