శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 28, 2020 , 10:42:58

రెడ్‌ జోన్లలో నిరంతరం సేవలు అందిస్తున్నాం : మేయర్‌

రెడ్‌ జోన్లలో నిరంతరం సేవలు అందిస్తున్నాం : మేయర్‌

హైదరాబాద్‌ : కరోనా నియంత్రణపై హైటెక్‌ సిటీ జంక్షన్‌లో శేరిలింగంపల్లి జోన్‌ జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం నిర్వహించిన ఫైట్‌ అగైనేస్ట్‌ కొవిడ్‌-19 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ హాజరయ్యారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టడంలో ముందుండి పని చేస్తామని ఎంటమాలజీ సిబ్బందితో మేయర్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

కరోనా వైరస్‌ను తరిమికొట్టడంలో ఎంటమాలజీ విభాగం స్పష్టమైన విధానం అనుసరిస్తోందని మేయర్‌ రామ్మోహన్‌ చెప్పారు. కరోనాను ఎదుర్కోవడానికి చాలా మంది భయపడ్డారు. కానీ జీహెచ్‌ఎంసీ సిబ్బంది భయపడకుండా సేవలందిస్తోందని కొనియాడారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కంటైన్‌మెంట్‌, రెడ్‌ జోన్లలో నిరంతరం సేవలు అందిస్తున్నారని తెలిపారు. గత నెల రోజులుగా ప్రాణాలను ఫణంగా పెట్టి జీహెచ్‌ఎంసీ కార్మికులు పని చేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. దేశ విదేశాల్లో కూడా హైదరాబాద్‌ గురించి చర్చ జరుగుతోందని మేయర్‌ తెలిపారు. మన చర్యలు ప్రపంచ దేశాలు ప్రశంసించేలా ఉన్నాయన్నారు మేయర్‌.logo