గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 11, 2020 , 01:35:31

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వివరాలేవి?

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వివరాలేవి?

  • కొండపోచమ్మసాగర్‌ ముంపు బాధితుల పిటిషన్లపై హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొండ పోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ కింద ఇండ్లు కోల్పోతున్నన సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల, బయిలంపూర్‌ గ్రామాల ముంపు బాధితులకు చెల్లించే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చర్చల వివరాలను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.  గతంలో ఇచ్చిన నోటీసులను పక్కనపెట్టి ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోతున్న ఇతర గ్రామాల ప్రజలకు ఇచ్చినట్లుగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చేందుకు తమతో చర్చలు జరుపాలని మామిడ్యాల, బయిలంపుర్‌కు చెందిన పలువు రు హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై వర్చువల్‌ విధానంలో విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనర్లు కోరుతున్నట్లుగా చర్చల ప్రక్రియపై ప్రభుత్వ అభిప్రాయం తెలుపాలన్నది.


logo