బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 10, 2020 , 18:32:38

లాక్‌‌డౌన్‌ పొడి‌గిం‌పు.. తెలంగాణబాటలో మరిన్ని రాష్ట్రాలు..

లాక్‌‌డౌన్‌ పొడి‌గిం‌పు.. తెలంగాణబాటలో మరిన్ని రాష్ట్రాలు..

హైద‌రా‌బాద్ : కేంద్ర ప్రభుత్వం విధిం‌చిన లాక్‌‌డౌ‌న్‌ను మరి‌కొం‌త‌కా‌లం‌పాటు పొడి‌గిం‌చడం ద్వారానే కరో‌నాను పూర్తి స్థాయిలో కట్టడి చేయ‌గ‌ల‌మన్న తెలం‌గాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు అభి‌ప్రా‌యా‌నికి మద్దతు పెరు‌గు‌తు‌న్నది. దాదాపు ఎని‌మిది రాష్ట్రాలు లాక్‌‌డౌ‌న్‌ను పొడి‌గిం‌చా‌లని స్పష్టం చేశాయి. కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండా తమ రాష్ట్రంలో లాక్‌‌డౌ‌న్‌ను ఈ నెలా‌ఖరు వరకు పొడి‌గి‌స్తు‌న్నట్టు ఒడిశా సీఎం నవీన్‌ పట్నా‌యక్‌ గురు‌వారం ప్రక‌టిం‌చారు. క్యాబి‌నెట్‌ సమా‌వేశం అనం‌తరం కర్ణా‌టక సీఎం యెడి‌యూ‌రప్ప మాట్లా‌డుతూ.. లాక్‌‌డౌ‌న్‌ను మరో 15 రోజు‌ల‌పాటు పొడి‌గిం‌చా‌లని మంత్రులు సూచిం‌చి‌నట్టు చెప్పారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మధ్య‌ప్ర‌దేశ్‌, మహా‌రాష్ట్ర, రాజ‌స్థాన్‌, హిమా‌చ‌ల్‌‌ప్ర‌దేశ్‌, పుదు‌చ్ఛేరి తది‌తర రాష్ట్రాలు కూడా లాక్‌‌డౌన్‌ పొడి‌గిం‌చా‌లని అంటు‌న్నాయి. దేశ ప్రజ‌లను కాపా‌డు‌కో‌వ‌డా‌నికి లాక్‌‌డౌ‌న్‌ను పొడి‌గిం‌చడం కంటే మరో మార్గం లేదని రాజ‌కీయ పార్టీలు, ప్రభుత్వ అధి‌కా‌రులు, నిపు‌ణులు కూడా పేర్కొం‌టు‌న్నారు. ఇప్పటి వరకు లాక్‌‌డౌ‌న్‌ను పక‌డ్బం‌దీగా అమలు చేయడం ద్వారానే కరోనా మూడవ దశకు వ్యాప్తి చెంద‌కుండా అడ్డు‌కో‌గ‌లి‌గా‌మ‌న్నారు.

కేంద్ర ప్రభుత్వం చేప‌ట్టిన చర్యల వల్ల దేశంలో వైరస్‌ వ్యాప్తి ఇప్ప‌టి‌వ‌రకూ ఆధీ‌నం‌లోనే ఉన్న‌దని, అయితే దాన్ని పూర్తిగా అంతం చేయా‌లంటే ఏప్రిల్‌ 14 వరకు ఉన్న లాక్‌‌డౌ‌న్‌ను మరిం‌త‌కా‌లం‌పాటు పొడి‌గి‌స్తేనే మంచి‌దని విజ్ఞప్తి చేస్తు‌న్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వ‌హిం‌చిన పార్ల‌మెం‌టరీ పార్టీ నేతల వీడియో కాన్ఫ‌రె‌న్స్‌లో టీఆ‌ర్‌‌ఎస్‌ పార్ల‌మెం‌టరీ పార్టీ నేతలు కే కేశ‌వ‌రావు, నామా నా‌గే‌శ్వ‌ర‌రా‌వులు కూడా లాక్‌‌డౌన్‌ పొడి‌గిస్తే మంచి‌దన్న అభి‌ప్రా‌యాన్ని వ్యక్తం చేశారు. ఈ సమా‌వే‌శంలో పాల్గొ‌న్న‌వా‌రిలో దాదాపు 80 శాతం మంది నేతలు లాక్‌‌డౌ‌న్‌ను పొడి‌గిం‌చా‌లని కోరారు. దేశంలో కరోనా పరి‌స్థి‌తు‌లపై చర్చిం‌చ‌డా‌నికి ప్రధాని మోదీ ఈ శని‌వారం అన్ని రాష్ట్రాల ముఖ్య‌మం‌త్రు‌లతో వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. ఈ కాన్ఫ‌రె‌న్స్‌లో సీఎంల అభి‌ప్రా‌యా‌లకు అను‌గు‌ణంగా లాక్‌‌డౌన్‌ పొడి‌గిం‌పుపై ఆయన నిర్ణయం తీసు‌కునే అవ‌కాశం ఉన్న‌దని విశ్లే‌ష‌కులు అంటు‌న్నారు.


logo