బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 06:41:53

ఫోన్ చేస్తే ఇంటికే మెడిసిన్స్.. వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సేవ

ఫోన్ చేస్తే ఇంటికే మెడిసిన్స్.. వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సేవ

  • ముందుకొచ్చిన యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ స్వచ్ఛంద సంస్థ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఫోన్‌చేస్తే ఇంటికే మందులు తెచ్చి ఇచ్చేందుకు యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎలాంటి ఆసరాలేక, ఎటూ కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సేవ చేసేందుకు పూనుకున్నది. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు ఫోన్‌ చేయగానే వీరు స్పందిస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా ప్రిస్క్రిప్షన్‌, చిరునామా వంటివి తెలుసుకొని మెడికల్‌ షాపుల నుంచి మందులు తీసుకొని వారికి అందిస్తున్నారు. బిల్‌ ఆధారంగా నగదు చెల్లించాలని కోరుతున్నారు. ఇందుకు ఎలాంటి రుసుం వసూలు చేయడంలేదు. దీంతో ఈ సంస్థ చేస్తున్న సేవ పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌.. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్నాటి రాజేందర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వారి సేవలను అభినందించారు. మందులు అవసరమైతే 9491114616, 814330 4148, 703747112, 9182339595, 8897736324 నంబర్లను సంప్రదించాలని సంస్థ అధ్యక్షుడు సూచించారు. మందు ల కొరత వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నదని, అందుకే ఫోన్‌చేస్తే మందులు అందించే సేవను ఉచితంగా ప్రారంభించామని తెలిపారు. భారత పౌరులుగా ఇది తమ బాధ్యత అని పేర్కొన్నారు.


logo