సోమవారం 25 మే 2020
Telangana - Apr 01, 2020 , 12:09:55

జీపీఎస్ ప‌ద్ధ‌తిలో క్వారెంటైన్ ట్రాకింగ్ : మ‌ంత్రి ఈటల రాజేంద‌ర్‌

జీపీఎస్ ప‌ద్ధ‌తిలో క్వారెంటైన్ ట్రాకింగ్ : మ‌ంత్రి ఈటల రాజేంద‌ర్‌

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 వేల మంది హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు.  వారంద‌రినీ ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేస్తున్న‌ట్లు మంత్రి ఈటెల రాజేంద‌ర్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఈ విష‌యాన్ని తెలిపారు. క్వారెంటైన్‌లో ఉన్న‌వారిని జీపీఎస్ ప‌ద్ధ‌తి ద్వారా ట్రాక్ చేస్తున్న‌ట్లు చెప్పారు.  తెలంగాన ఆరోగ్య‌శాఖ సుమారు 25 వేల మందిని ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేస్తున్న‌ద‌న్నారు. రియ‌ల్‌టైమ్‌లో వారి లొకేష‌న్‌ను గుర్తిస్తున్నామ‌న్నారు.  కోవిడ్‌19 మానిట‌రింగ్ వ్య‌వ‌స్థ ద్వారా ఈ ప్ర‌క్రియ జ‌రుగుతున్న‌ద‌ని మంత్రి చెప్పారు.  logo