శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 11:53:36

సామాజిక దూరం పాటిస్తున్న ప్రజలు

సామాజిక దూరం పాటిస్తున్న ప్రజలు

నడిగూడెం: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా గ్రామాల ప్రజలు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలు అమలుపరుస్తున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని పలు గ్రామాల ప్రజలు కరోనా వైరస్‌ నియంత్రఫపై ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు, మందుల కొనుగోలు సమయంలో దుకాణాల ముందు గీసిన వృత్తాల్లోనే నిలిచి తమ కావాల్సినవి తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని, పలు దుకాణాల ముందు ఉన్న క్యూలైన్‌లను ప్రజలు పాటిస్తున్నారని నడిగూడెం సర్పంచ్‌ నాగలక్ష్మి మల్లేష్‌యాదవ్‌ తెలిపారు.  


logo