శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 11:23:56

తాతయ్య మృతిపై మనవడి ట్వీట్‌.. స్పందించిన కేటీఆర్‌

తాతయ్య మృతిపై మనవడి ట్వీట్‌.. స్పందించిన కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ యువకుడు తన తాతయ్య మృతిపై ట్వీట్‌ చేశాడు. ఏపీలోని కూచిపూడిలో మంగళవారం గుండెపోటుతో తన తాతయ్య మరణించారు. ఆయన కడసారి చూపులకు నగరం నుంచి వెళుతుంటే పోలీసులు తమను అడుగడుగునా అడ్డుకున్నారని, చివరి చూపులకు నోచుకోలేదని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేగాకుండా దీనిపై వెంటనే స్పందించాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. సోషల్‌ మీడియాలో ఏ విన్నపం వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు కేటీఆర్‌. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌లపై మంత్రి కేటీఆర్‌ నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఏ విన్నపం వచ్చినా తక్షణమే స్పందిస్తున్నారు.


logo