గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 16:45:52

విదేశీ విమానాలు రద్దు చేయాల్సిందిగా కేంద్రానికి మంత్రి ఈటల విజ్ఞప్తి

విదేశీ విమానాలు రద్దు చేయాల్సిందిగా కేంద్రానికి మంత్రి ఈటల విజ్ఞప్తి

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరానికి వచ్చే విదేశీ విమానాలను పూర్తిగా రద్దు చేయాల్సిందిగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్దన్‌కు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారానే కోవిడ్‌-19 వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానికంగా కరోనా వైరస్‌ లేదన్నారు. కావునా కరోనా వ్యాప్తి నివారణకు విదేశాల నుంచి ప్రయాణీకులను నిలువరించాల్సిందిగా పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా కోవిడ్‌-19 బాధిత దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విదేశీ ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. 

కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సందర్శకులను నిలిపివేసింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణ, చికిత్సపై మంత్రి ఈటల అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. భేటీకి సీఎస్‌, డీజీపీ, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌ అధికారులు హాజరయ్యారు. విదేశాలనుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని వారందరినీ క్వారంటైన్‌లో ఉంచే ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. క్వారంటైన్లలో అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను మంత్రి ఆదేశించారు. ఎంత మంది బాధితులు వచ్చినా చికిత్సకు సిద్ధంగా ఉండాలన్నారు.


logo