మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 01:08:19

21 వరకు బార్లు, క్లబ్‌లు మూసివేత

21 వరకు బార్లు, క్లబ్‌లు మూసివేత

ఎక్సైజ్‌శాఖకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల 21 వరకు బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లు, వైన్స్‌లోని పర్మిట్‌ రూంలను మూసివేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను తక్షణమే అమలు జరుపాలని ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. 


31 వరకు విద్యాసంస్థల బంద్‌

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను ఈ నెల 31 వరకు మూసివేయనున్నారు. ఈ మేరకు ఆదివారం  ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలు, యూనివర్సిటీలను మూసివేయాలని ఆమె సూచించారు. ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసిన బోర్డుపరీక్షలు, ప్రవేశపరీక్షలు యథావిధిగా నిర్వహించవచ్చని తెలిపారు. 


 వైద్య కళాశాలలకు సెలవులు 

తెలంగాణలో వైద్య కళాశాలలకు ఈ నెల 31వ తేదీవరకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదలచేసింది. వైద్యసేవల దృష్ట్యా దవాఖానల్లో పనిచేస్తున్న ఇంటర్న్‌షిప్‌, పీజీ, నర్సింగ్‌ విద్యార్థులు, వైద్య కళాశాలల ఫ్యాకల్టీ, కార్యాలయ సిబ్బందికి సెలవులు వర్తించవని పేర్కొన్నది. కరోనా వ్యాప్తితో ముందుజాగ్రత్తల్లో భాగంగా ఈ నెల 31 వరకు ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో తరగతుల నిర్వహణను రద్దుచేస్తున్నట్టు అధికారులు ఆదివారం ప్రకటించారు. యూజీ, పీజీ, పీజీడీటీఈ, పీజీడీటీఏ, బీఎడ్‌, పీహెచ్‌డీ విద్యార్థులు 18లోగా హాస్టళ్లు ఖాళీచేయాలన్నారు. 


logo
>>>>>>