బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 00:55:09

ఆందోళన వద్దు.. జాగ్రత్తలు చాలు

 ఆందోళన వద్దు.. జాగ్రత్తలు చాలు
  • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • వ్యాక్సిన్‌ తయారుచేసే సంస్థల పన్ను రద్దుచేస్తామని వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌పై ఆందోళన చెందవద్దని, తగిన జాగ్రత్తలు పాటిస్తే అరికట్టవచ్చని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్‌రెడ్డి చెప్పారు. కరోనా కట్టడికి కేంద్రం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతీయుల్లో వ్యాధినిరోధకశక్తి ఎక్కువని, అందుకే తక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ తయారుచేసే ఫార్మా కంపెనీలకు పన్ను మినహాయింపు ఇస్తామని చెప్పారు. ఇటలీలో చిక్కుకుపోయి న భారతీయులను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. logo
>>>>>>