గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 20:53:19

బెస్ట్‌ పథకం గడువు పొడగింపు...

బెస్ట్‌ పథకం గడువు పొడగింపు...

హైదరాబాద్‌: తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ (బెస్ట్‌) పథకం, వివేకానంద స్కీం గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభమైంది. ఈ నెల 20 తేదీ వరకు గడువు పొడగించినట్లు తెలంగాణ బ్రాహ్మణపరిషత్‌ అధికారులు తెలిపారు. ఔత్సాహిక బ్రాహ్మణ పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించిన బెస్ట్‌ పథకానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బెస్ట్‌ పథకంతో పాటు వివేకానంద విద్య, శ్రీరామానుజ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు మార్చి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 


ఈ పథకం ఐప్లె చేయడానికి కావల్సినవి...

1) ఫోటో

2)బోనాఫైడ్‌ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు

3) ఆధార్‌కార్డు

4)పాన్‌ కార్డు

5)కుల దృవీకరణ పత్రం( తహసీల్దార్‌ కార్యాలయంలో ఇస్తారు)

6) ఆదాయ దృవీకరణ పత్రం

7)10వ తరగతి మెమో

8)బ్యాంక్‌ అకౌంట్‌ ( ఎన్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు)

9) ప్రాజెక్టు రిపోర్టు

10 రేషన్‌కార్డులు https://brahminparishad.telangana.gov.in/FirstPage.do వెబ్‌సైట్‌లో ఐప్లె చేసే సమయంలో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 


logo