బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 01:57:53

చరిత్రలో నిలిచేలా మైనార్టీ సంక్షేమం

చరిత్రలో నిలిచేలా మైనార్టీ సంక్షేమం
  • కచ్చితంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇస్తాం
  • మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ
  • శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ
  • మరే రాష్ట్రంలోనూ ఈస్థాయి పథకాలు లేవు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తాను 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని.. ఆ సమయంలో మైనార్టీ సంక్షేమానికి అప్పటి ప్రభుత్వం రూ.26 కోట్లు కేటాయిస్తే ఎంతో సంతోషపడ్డామని.. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి గరిష్ఠంగా రూ.36 కోట్ల కేటాయింపుల కోసం పోరాడాల్సి వచ్చిందని శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. కానీ  కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణలో మైనార్టీ సంక్షేమానికి ఏకంగా రూ.1,500 కోట్లు కేటాయించడమే కాకుండా గతేడాది ప్రకటించిన రూ.1,020 కోట్లను ఖర్చుచేయడం అభినందనీయమన్నారు. శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ మొదలుపెట్టారు. సంక్షేమ పద్దులపై స్పీకర్‌ చర్చ చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ, గృహ నిర్మాణశాఖల పద్దులను మం త్రులు సభలో ప్రవేశపెట్టారు.కాంగ్రెస్‌ సభ్యు డు పొదెం వీరయ్య పద్దులపై చర్చ ప్రారంభించారు. అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. ఆరేండ్లలోనే సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో, అన్నిప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిపారని తెలిపారు. ముఖ్యంగా సంక్షేమరంగంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఈస్థాయిలో పథకాలను చేపట్టిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతిస్తున్నారని తనను చాలామంది అడిగారని, కొంతమంది విమర్శలు చేశారని, కానీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మైనార్టీ సంక్షేమాన్ని చేపడుతున్న ప్రభుత్వానికి కచ్చితంగా తాము అండగా నిలుస్తామని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీతోపాటు మైనార్టీ సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేసిన 54 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గణాంకాలతో వివరించారు. రాష్ట్రంలోని నిరుపేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నందునే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ఆ పార్టీకి పట్టం కడుతున్నారని స్పష్టంచేశారు. 


వక్ఫ్‌ బోర్డులో సమగ్ర విచారణ చేయించాలి

వక్ఫ్‌ బోర్డులో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం అవుతున్నదని, అర్హతలేని వా రికి పదోన్నతులు వస్తున్నాయని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఆ వివరాలను సభ ముందు ఉంచారు. వేలఎకరాల వక్ఫ్‌ బోర్డు భూ ములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆ వివరాలను చదివి వినిపించారు. ప్ర భుత్వం సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్‌చేశారు. మైనార్టీల సంక్షేమానికి ఇంకా చర్యలు తీసుకొంటే సీఎం కేసీఆర్‌ చరిత్రలో చిరస్థాయిగా ఉంటారన్న అక్బరుద్దీన్‌.. వాటిని వివరించారు. ఎమ్మెల్యే లు అబ్రహం, దుర్గం చిన్నయ్య, అనసూ య, శంకర్‌నాయక్‌ మాట్లాడారు.


logo
>>>>>>