శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 01:15:51

కే కే, సురేశ్‌రెడ్డి ఎన్నిక లాంఛనమే!

కే కే, సురేశ్‌రెడ్డి ఎన్నిక లాంఛనమే!
  • రాజ్యసభకు నామినేషన్‌ వేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు
  • 16న నామినేషన్‌ పత్రాల పరిశీలన.. 18న అధికారిక ప్రకటన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా కే కేశవరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి నామినేషన్లు దాఖ లుచేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నరసింహాచార్యులుకు వారు రెండుసెట్ల చొప్పున నామినేషన్‌ పత్రాలు అందజేశారు. కేకే నామినేషన్‌ పత్రాలపై మంత్రులు కే తారకరామారావు, ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, పలువురు ఎమ్మెల్యేలు సంతకాలుచేశా రు. సురేశ్‌రెడ్డి నామినేషన్‌పత్రాలపై మం త్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, పలువురు ఎమ్మెల్యేలు సంతకాలుచేశారు. నామినేషన్ల దాఖలుకుముందు కేకే, సురేశ్‌రెడ్డి.. ఎంపీ సంతోష్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపంవద్ద నివాళి అర్పించారు. ఈ నెల 16న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. శాసనసభలో టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉండటం తో వీరి ఎన్నిక లాంఛనమే. ఈ నెల 18 న వారి ఎన్నికను ప్రకటించనున్నారు. కేకే, సురేశ్‌రెడ్డిని మాజీ ఎంపీ కవిత అసెంబ్లీ ఆవరణలో కలిసి అభినందించా రు. నామినేషన్‌ అనంతరం ఎంపీలు సం తోష్‌, బండ ప్రకాశ్‌, బడుగుల లింగయ్యతోపాటు రాజ్యసభ అభ్యర్థులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. పెద్దలసభలో రాష్ట్రవాణిని బలంగా వినిపించాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా వారికి సూచించారు.


logo