మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 01:49:45

రాష్ట్రంలో సీ ప్లేన్‌ డిజైన్‌ సెంటర్‌

రాష్ట్రంలో సీ ప్లేన్‌ డిజైన్‌ సెంటర్‌
  • స్వీడన్‌ సంస్థ రెవిన్‌ ఏవియేషన్‌ ప్రకటన
  • బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్‌షో ప్రారంభం

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ పరిసరాల్లో సీప్లేన్‌ (సముద్రపు విమానం) డిజైన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు స్వీడన్‌కు చెందిన రెవిన్‌ ఏవియేషన్‌ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్‌ నిల్స్‌ పిల్‌బ్లాడ్‌ చెప్పారు. వింగ్స్‌ ఇం డియా  ఎయిర్‌షో-2020లో భాగంగా గురువారం బేగంపేటలో ఆయన మీడియాతో మా ట్లాడారు. సీప్లేన్‌ డిజైన్‌ యూనిట్‌ను ఏర్పాటుచేయడానికి హైదరాబాద్‌ అనువైన ప్రదేశమని భావిస్తున్నట్టు చెప్పారు. విమానాశ్రయాల ఏ ర్పాటుకు భూమికొరత ఏర్పడుతున్న నేపథ్యంలో సీప్లేన్‌లకు మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు. దీనిపై పదేండ్లపాటు అధ్యయనం చేశామని చెప్పారు. సీప్లేన్‌లను ఎయిర్‌ అంబులెన్స్‌లుగా కూడా వినియోగించవచ్చన్నారు. 2013 లో స్లీప్లేన్‌లను కొనుగోలుచేసిన కేరళ ప్రభుత్వం రాష్ర్టానికి వచ్చే పర్యాటకులను అలరిస్తున్నదని చెప్పారు. ఇద్దరు పైలట్లు, 10మంది ప్రయాణికులు కూర్చునేవిధంగా  విమానాలను రూపొందించామని తెలిపారు. 


వింగ్స్‌ ఇండియా ప్రారంభం

నాలుగురోజులపాటు జరిగే వింగ్స్‌ఇండియా ఎయిర్‌షో-2020 గురువారం ప్రారంభమైంది. మొదటిరోజు రెండు బృందాలు ఎయిర్‌షో నిర్వహించాయి. సాధారణ ప్రజలను అనుమతించకపోవడంతో ఎయిర్‌షో వెలవెలపోయింది. కరోనా నేపథ్యంలో ఇతరదేశాల ప్రతినిధుల రాకపై కూడా  ఆంక్షలు విధించారు. దీంతో విమానాలు కూడా అతి తక్కువగా వచ్చాయి. వైమానిక రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు తమ సంస్థల గురించి, వాటి ప్రత్యేకతలను తెలుపుతూ నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకొన్నాయి.  


logo
>>>>>>