బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 00:59:50

మృత్యు శకటాలు

మృత్యు శకటాలు
  • బైక్‌ను ఢీకొట్టి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
  • జడ్చర్లలో ముగ్గురు దుర్మరణం
  • కాజీపేట సమీపంలో మరో ప్రమాదం.. ఇద్దరు మృతి

జడ్చర్ల రూరల్‌/మడికొండ: అతివేగంతో దూసుకొచ్చిన లారీలు మృత్యుశకటాలుగా మారాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ముగ్గురిని, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట సమీపంలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరిని పొట్టనబెట్టుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కర్నూల్‌ నుంచి పనసపండ్ల లోడుతో వస్తున్న లారీ గురువారం ఉదయం 10 గంటల సమయంలో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోకి చేరుకున్నది. వేగంగా వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారి నుంచి సర్వీస్‌ రోడ్డుపైకి ఉన్న డైవర్షన్‌ను గమనించిన డ్రైవర్‌ ఒక్కసారిగా లారీని తిప్పాడు. ఈ క్రమంలో ముందువెళ్తున్న బైక్‌తోపాటు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. అదుపుతప్పి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం రాజాపూర్‌కు చెందిన బంగారయ్య(25), వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండ లం మున్ననూరుకు చెందిన మల్లయ్య(35)తోపాటు కావేరమ్మపేట వాసి రఫీయొద్దీన్‌ (60) అక్కడికక్కడే మృతిచెందారు. ఇంట్లో ఉన్న ఇద్ద రు మహిళల్లో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. 


టిప్పర్‌, లారీ ఢీకొని ఇద్దరు మృతి.. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలం రాం పూర్‌ శివారులో వరంగల్‌-హైదరాబాద్‌ జాతీ య రహదారిపై టిప్పర్‌, లిక్కర్‌ లోడ్‌తో వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. టిప్పర్‌ క్యాబి న్‌ నుజ్జునుజ్జు కాగా, లిక్కర్‌ లారీ బోల్తా పడింది. ప్రమాదంలో గుంజ రాజు, మీనజ్‌ఖాన్‌ అక్కడికక్కడే మృతిచెందగా, రాజానంద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. 


logo